Kurnool accident: కర్నులు జిల్లాలో ఒకే చోట రెండు రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి

Three Killed in Tragic Road Accidents in Kurnool Chennamma Circle
షార్ట్స్‌లో చూడండి
కర్నూలు నగరంలో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెన్నమ్మ సర్కిల్ వద్ద ఒకేచోట స్వల్ప వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సహాయం చేయబోయిన వారు కూడా మృత్యువాత పడటంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. చెన్నమ్మ సర్కిల్ వద్ద వేగంగా వచ్చిన ఓ లారీ మొదట ఓ పాదచారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే సహాయం చేయడానికి అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం ఇస్తున్న సమయంలోనే, మరో లారీ వేగంగా వారిపైకి దూసుకొచ్చింది. ఈ దుర్ఘటనలో సహాయం చేయబోయిన ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడికక్కడే మరణించారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మంచి చేయాలనే ఉద్దేశంతో వెళ్లిన వారు కూడా మృత్యువాత పడటం పలువురిని కలచివేసింది. మృతుల కుటుంబాలకు సమాచారం అందించగా, వారి రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Go Back to Shorts
Kurnool accident
Kurnool
Road accident
Andhra Pradesh
Chennamma Circle
Truck accident
Pedestrian accident
Fatal accident
Accident investigation

More Telugu News