Nandyala: నంద్యాల వద్ద ప్రైవేట్ బస్సుకు ప్రమాదం..10 మందికి గాయాలు, తప్పిన పెనుముప్పు

Nandyala Private Bus Accident Injures 10 Passengers
షార్ట్స్‌లో చూడండి
వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు టైరు పేలిపోవడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకువెళ్లిన ఘటన నంద్యాల జిల్లా కేంద్రం సమీపంలో ఈరోజు వేకువజామున జరిగింది. ఈ ఘటనలో పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో వణికిపోయారు. ప్రయాణికులు గాయాలతో బయటపడటంతో పెనుప్రమాదం తప్పినట్లైంది.

వివరాల్లోకి వెళ్తే.. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 35 మంది ప్రయాణికులతో వెళ్తోంది. నంద్యాల సమీపంలోని జాతీయ రహదారిపైకి రాగానే తెల్లవారుజామున బస్సు టైరు పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఆ సమయంలో బస్సు అధిక వేగంతో ఉండటంతో డ్రైవర్ ఎంత ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. దీంతో రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి వేగంగా దూసుకెళ్లింది.

బస్సు అకస్మాత్తుగా కుదుపులకు లోనవడంతో లోపల ఉన్న ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేశారు. అదృష్టవశాత్తు బస్సు బోల్తా పడకుండా పొలాల్లో నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
Go Back to Shorts
Nandyala
Nandyala bus accident
Morning Star Travels
bus accident
Andhra Pradesh accident
road accident
private bus accident
Nandyala district
AP news

More Telugu News