Telangana Government: కన్నవారిని వదిలేస్తే జీతంలో కోత.. తెలంగాణలో కొత్త చట్టం
మారిన కాలంతో పాటు మనుషుల మధ్య బంధాలు బలహీనపడుతున్నాయి. ముఖ్యంగా కన్నవారిని వృద్ధాప్యంలో చూసుకోవాల్సిన బాధ్యతను పిల్లలు విస్మరిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ సామాజిక సమస్యకు పరిష్కారంగా, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక అడుగు ముందుకు వేసింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులకు గట్టి గుణపాఠం చెప్పేందుకు ‘టీఈఏఎంపీఎస్-2026’ (తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్) పేరుతో ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది.
ఈ చట్టం ప్రకారం తమను పిల్లలు పట్టించుకోవడం లేదని వృద్ధ తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే, ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగుతుంది. విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే సదరు ఉద్యోగి జీతం నుంచి 15 శాతం లేదా గరిష్ఠంగా రూ.10,000 (ఏది తక్కువైతే అది) కోత విధిస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఒకవేళ ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే ఆ కోత మొత్తాన్ని అందరి జీతాల నుంచి సమానంగా వసూలు చేస్తారు. ఈ నిబంధనలు ప్రభుత్వ శాఖలతో పాటు కార్పొరేషన్లు, బోర్డులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేసే వారందరికీ వర్తిస్తాయి.
బాధిత తల్లిదండ్రులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో జిల్లా కలెక్టరేట్లలో ఫిర్యాదు చేయవచ్చు. కేవలం 45 రోజుల్లోనే సమస్యను పరిష్కరించేలా గడువు విధించడం ఈ చట్టంలోని మరో ముఖ్యమైన అంశం. ఒకవేళ కలెక్టర్ తీర్పుతో సంతృప్తి చెందకపోతే, రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కమిషన్‌ను ఆశ్రయించే వెసులుబాటు కూడా కల్పించారు. అయితే, సొంతంగా పెన్షన్ లేదా ఇతర ఆదాయ వనరులు లేకుండా, పూర్తిగా పిల్లలపైనే ఆధారపడిన వృద్ధులకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసోంలోని 'ప్రణామం' చట్టం స్ఫూర్తితో ఈ బిల్లును రూపొందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిలో మార్పులు చేసే అధికారంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా సమాచారం ప్రకారం, సోమవారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. అనంతరం, ఒకటి రెండు రోజుల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ చట్టం అమలు కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది.