Nara Lokesh: అధికార పీఠంపై 25 ఏళ్లు... ప్రధాని మోదీకి సెల్యూట్ చేస్తున్నా: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Salutes PM Modi for 25 Years in Power
షార్ట్స్‌లో చూడండి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయ చరిత్రలో ఒక కొత్త రికార్డు సృష్టించారు. దేశంలో సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వాధినేతగా పనిచేసిన వ్యక్తిగా ఆయన నిలిచారు. 25 ఏళ్లుగా ఆయన అధికార పీఠంపై ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన, ఆ తర్వాత 2014 నుంచి భారతదేశ ప్రధానిగా అధికారంలో కొనసాగుతున్నారు. దీనిపై ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తనదైన శైలిలో స్పందించారు. ఈ చారిత్రక ఘనత సాధించిన ప్రధాని మోదీకి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.

"గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి,

భారతదేశ చరిత్రలోనే సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వాధినేతగా పనిచేసిన వ్యక్తిగా మీరు సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పిన ఈ చారిత్రక సందర్భంలో మీకు నా హృదయపూర్వక అభినందనలు. ఏకంగా 8,931 రోజులు అధికారంలో కొనసాగడం అనేది ఒక అద్భుతమైన, అసాధారణమైన మైలురాయి.

దశాబ్దాలుగా ప్రజాసేవ, దేశ నిర్మాణం పట్ల మీకున్న అచంచలమైన నిబద్ధతకు, అంకితభావానికి ఈ ఘనత అద్దం పడుతోంది. మీ అవిశ్రాంత నాయకత్వం, స్పష్టమైన దార్శనికత, భారతదేశ ప్రగతిపై మీకున్న ఏకాగ్రత దేశవ్యాప్తంగా లక్షలాది మందిలో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయి.

అయ్యా, ఈ చారిత్రాత్మక విజయం సాధించినందుకు మీకు మరోసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అంటూ లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Narendra Modi
PM Modi
Indian Politics
Longest Serving PM
Gujarat CM
AP Minister
Political Record
Narendra Modi 25 Years
Telugu News

More Telugu News