Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్.. పేద ముస్లిం కుటుంబానికి కొత్త ఇల్లు
మంగళగిరిలో ఓ పేద ముస్లిం కుటుంబానికి ఇచ్చిన మాటను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిలబెట్టుకున్నారు. గతేడాది పవిత్ర రంజాన్ మాసంలో చేసిన వాగ్దానాన్ని ఏడాది తిరగకముందే నెరవేర్చి, వారికి కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే... గతేడాది రంజాన్ మాసం సందర్భంగా మంత్రి లోకేశ్ మంగళగిరి బస్టాండ్ సమీపంలో నివసించే షేక్ షహెన్షా నివాసానికి ఆకస్మికంగా వెళ్లారు. అక్కడ షహెన్షా కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారి శిథిలావస్థలో ఉన్న రేకుల ఇంటిని మంత్రి పరిశీలించారు. తమ పూర్వీకులు నిర్మించిన ఆ ఇంటి స్థానంలో కొత్త ఇల్లు కట్టించి ఆదుకోవాలని షహెన్షా కుటుంబ సభ్యులు మంత్రిని కోరారు.
వారి అభ్యర్థనకు స్పందించిన లోకేశ్, ఆ కుటుంబ బాధ్యతను తాను తీసుకుంటానని, కొత్త ఇల్లు నిర్మించి ఇస్తానని అక్కడికక్కడే హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఏడాది పూర్తి కాకముందే షహెన్షా కుటుంబానికి నూతన గృహాన్ని నిర్మించి ఇచ్చారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇచ్చిన హామీని మళ్లీ అదే రంజాన్ మాసం వచ్చేసరికి నెరవేర్చడం గమనార్హం.