Chandrababu Naidu: తిరుమల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనలో భాగంగా టీటీడీ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నిన్న తిరుమలలోని గాయత్రీ నిలయం అతిథి గృహంలో ఈ సమావేశం జరిగింది. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో తిరుమల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు.
వేసవిలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా చేయాల్సిన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుమలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, దర్శన ఏర్పాట్లు, పర్యావరణ పరిరక్షణ చర్యలపై ఆరా తీశారు. ఈ సమావేశంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు (మార్చి 21) సందర్భంగా కుటుంబ సమేతంగా నిన్న తిరుమలకు విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు తమ కుటుంబం తరఫున ఒక రోజు అన్నదానానికి అయ్యే ఖర్చు కింద రూ. 44 లక్షల విరాళాన్ని అందజేశారు.
కాగా, ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం, చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించనున్నారు. అనంతరం, తిరుమలలో సుమారు రూ. 20-25 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని ఆయన ప్రారంభించనున్నారు. ఈ ల్యాబ్‌లో శ్రీవారి లడ్డూ, ఇతర ప్రసాదాల నాణ్యతను శాస్త్రీయంగా పరీక్షించనున్నారు.