MS Dhoni: ధోనీ విజయం వెనుక ఉన్నది మీరే: మామయ్యపై సాక్షి పోస్టు

Sakshi Dhoni credits uncle Paan Singh for MS Dhonis success
షార్ట్స్‌లో చూడండి
తన భర్త మహేంద్ర సింగ్ ధోనీ విజయం వెనుక తన మామయ్య పాన్ సింగ్ ఉన్నారని సాక్షి సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొంది. తన మామయ్య పాన్ సింగ్ ధోనీ పుట్టినరోజు కావడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది. తన భర్త విజయం వెనుక తన మామయ్య పాత్ర ఎంతో ఉందని పేర్కొంది. నిరంతరం ఆయన స్ఫూర్తితోనే ధోనీ ముందుకు సాగుతున్నారని తెలిపింది.

తాను కెరీర్‌లో ఎదగడంలో తన తల్లిదండ్రులదే ముఖ్య పాత్ర అని ధోనీ పలు సందర్భాల్లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సాక్షి ధోనీ తన మామయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ధోనీ వెనుక ఆయన ఉన్నాడని తెలిపింది.

ధైర్య సాహసాలతో ఒంటరిగా మీరు చిన్న వయస్సులోనే గ్రామాన్ని వీడారని, ఈరోజు దేశమంతా గౌరవించే గొప్ప వారసత్వాన్ని నిర్మించారని సాక్షి ధోనీ పేర్కొంది. మీ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం అంటూ తన మామయ్యను ఉద్దేశించి తెలిపింది. నా ధోనీ విజయం వెనుక ఉన్న బలం మీరే, కేవలం మీ వల్లే ఆయన ఈ స్థానంలో ఉన్నాడు అని పేర్కొంది. మిమ్మల్ని అనునిత్యం ప్రేమిస్తూనే ఉంటాం.. పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ముగించింది.
Go Back to Shorts
MS Dhoni
Mahendra Singh Dhoni
Sakshi Dhoni
Dhoni birthday
Paan Singh
Dhoni success
Indian cricket

More Telugu News