నేడు వైసీపీ ఇఫ్తార్ విందు.. పాల్గొననున్న జగన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడు వైసీపీ ఇఫ్తార్ విందు.. పాల్గొననున్న జగన్

YS Jagan to Participate in YSRCP Iftar in Vijayawada
  • విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో వైసీపీ ఇఫ్తార్ విందు
  • సాయంత్రం 6 గంటలకు విజయవాడకు చేరుకోనున్న జగన్
  • కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొననున్న ముస్లింలు, పార్టీ శ్రేణులు

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలకు వైసీపీ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తోంది. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఈరోజు విందును నిర్వహించనుంది. ఈ విందులో వైసీపీ అధినేత జగన్ పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేసి, వారితో కలిసి ఉపవాస విరమణలో ఆయన పాల్గొంటారు.


ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ సాయంత్రం 6 గంటలకు విజయవాడకు చేరుకుంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం 7 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి తిరుగుపయనమవుతారు. వైసీపీ ఇఫ్తార్ విందులో పెద్ద సంఖ్యలో ముస్లింలు, మత పెద్దలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.

Advertisement
Jagan
YS Jagan
YSRCP
YSR Congress
Iftar
Iftar Party
Vijayawada
Ramzan
Muslims
Andhra Pradesh Politics

More Telugu News