జగ్గారెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy says Jaggareddy should be PCC Chief
  • జగ్గారెడ్డి ఎప్పుడూ ప్రజల్లో ఉండే మాస్ లీడర్ అన్న మంత్రి
  • జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వస్తాయన్న మంత్రి
  • ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే ఆదుకుంటారన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మాట్లాడుతూ, పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేయాలని వ్యాఖ్యానించారు. ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఉండే మాస్ లీడర్ అని కితాబిచ్చారు.

ఆయనకు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెబితే కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు కచ్చితంగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి మరో పీజీఆర్ అని ప్రశంసించారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే ఆదుకుంటారని అన్నారు.

ఇటీవల సంగారెడ్డిలో జరిగిన ఒక కార్యక్రమంలో కూడా జగ్గారెడ్డిపై మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రశంసలు కురిపించారు. జగ్గారెడ్డి మానవత్వం ఉన్నమనిషి అని అన్నారు. ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు సహాయం అందిస్తారని అన్నారు.
Advertisement
Komatireddy Venkat Reddy
Jaggareddy
Telangana PCC
Telangana Congress
PCC President
Uttam Kumar Reddy

More Telugu News