Sushmita: గృహ ప్రవేశానికి హాజరై.. ఫొటో దిగుతూనే కుప్పకూలిన మహిళ
ఒక గృహ ప్రవేశ వేడుకకు హాజరైన ఓ మహిళ ఆ ఇంటి వారితో ఫొటో దిగుతూనే కుప్పకూలిపోయింది. ఈ విషాద సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో జరిగింది. ఖమ్మంలోని త్రీటౌన్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల సుస్మిత తన బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లింది. కుటుంబ సభ్యులతో ఫొటో దిగేందుకు వేదిక వద్దకు చేరుకుంది.
వారికి శుభాకాంక్షలు చెప్పి, ఫొటో దిగుతుండగానే ఒక్కసారిగా వెనక్కి పడిపోయింది. పక్కన ఉన్న యువతి భుజంపై చేయి వేసి ఫొటో దిగుతుండగా ఈ ఘటన జరిగింది. పక్కనున్న వారు ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె కొన్ని రోజులుగా గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.