చెన్నై సూపర్ కింగ్స్‌పై రూ.1 కోటికి దావా వేసిన సన్ టీవీ నెట్ వర్క్... ఎందుకంటే?

Sun TV Network Sues Chennai Super Kings for Copyright Infringement
  • సీఎస్కే కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిందంటూ దావా
  • అనుమతి లేకుండానే తమ సినిమాల్లోని కంటెంట్‌ను వాడుకుందని దావా
  • ఇప్పటికే కంటెంట్‌ను నిలిపివేసినట్లు హైకోర్టుకు తెలిపిన సీఎస్కే
సన్ టీవీ నెట్ వర్క్, ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై మద్రాస్ హైకోర్టులో కాపీరైట్ ఉల్లంఘన దావా వేసింది. తమ అనుమతి లేకుండానే జైలర్, జైలర్-2, కూలీ సినిమాల్లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆడియో ట్రాక్‌లు, డైలాగులను సీఎస్కే తమ ప్రచార వీడియోలో వాడుకుందంటూ రూ.1 కోటికి దావా వేసింది. వాణిజ్యపరంగా వాటిని ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది.

సీఎస్కే ఉపయోగించిన కంటెంట్ కాపీరైట్ రక్షణ పరిధిలో ఉందని, దీనిని వినియోగించుకోవాలంటే తమ ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆ చిత్రాల నిర్మాతలు హైకోర్టుకు తెలిపారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో తాము చేసుకున్న ఒప్పందాలను హైకోర్టుకు వారు సమర్పించారు.

కాపీ రైట్ కలిగిన కంటెంట్‌ను సీఎస్కే అనధికారికంగా వినియోగిస్తోందని మార్చి 1న మెయిల్ కూడా పంపించామని, దాంతో తమ మెటిరీయల్ వినియోగాన్ని సీఎస్కే నిలిపివేసిందని సన్ టీవీ తరఫున రవీంద్రన్ పేర్కొన్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం హక్కులన్నీ తమకే చెందుతాయని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

తాము ఇప్పటికే ఆ కంటెంట్‌ను నిలిపివేశామని చెన్నై సూపర్ కింగ్స్ కూడా హైకోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఆంక్షలు మరియు జరిమానాలపై నిర్ణయం తీసుకోవడానికి ముందు మరోసారి ఇరుపక్షాల వాదనలను వినాలని నిర్ణయించింది.
Go Back to Shorts
Sun TV Network
Chennai Super Kings
CSK
Copyright Infringement
Madras High Court
Jailer Movie

More Telugu News