Israel Iran War: ఇరాన్‌తో యుద్ధం... సురక్షితంగా స్నానం చేయడానికి 'కెన్ ఐ షవర్'ను ఉపయోగిస్తున్న ఇజ్రాయెలీలు

Israel Iran War Israelis Use Can I Shower for Safe Showering
  • ఇరాన్‌తో ఎనిమిదో రోజుకు చేరిన ఇజ్రాయెల్ యుద్ధం
  • ఇజ్రాయెలీల దైనందిన జీవితంపై ప్రభావం
  • కెన్ ఐ షవర్ యాప్ ద్వారా అలర్ట్స్ తెలుసుకుంటున్న ప్రజలు
ఇరాన్‌తో యుద్ధం వేళ, ఏ సమయంలో ఎక్కడ ఏ క్షిపణి పడుతుందో, ఏ బాంబు పడుతుందో తెలియని పరిస్థితి ఉంది. దీనితో ఇజ్రాయేల్ ప్రజల దైనందిన జీవితానికి అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో ఆ దేశ ప్రజలు 'కెన్ ఐ షవర్' అనే యాప్  లేదా వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తున్నారు. గత ఎనిమిది రోజులుగా అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. దీంతో నిత్యం ఎయిర్ సైరన్ల మోత వినిపిస్తోంది.

యుద్ధ భయంతో చాలామంది స్నానం చేయడానికి కూడా భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో 'కెన్ ఐ షవర్'ను ఉపయోగించి ఏ సమయంలో స్నానం చేయడం సురక్షితమో తెలుసుకుంటున్నారు. క్షిపణుల ప్రమాదం ఉన్నసమయంలో స్థానిక యంత్రాంగం ప్రజలకు అలర్ట్స్ ఇస్తోంది. దానితో పాటు సైరన్లు మోగుతుంటాయి. ఆ సమయంలో బాంబు షెల్టర్లు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడానికి 30 సెకన్ల నుంచి 90 సెకన్లకు మించి సమయం ఉండదని చెబుతున్నారు.

ఇలాంటి సమయంలో స్నానం చేస్తూ ఉంటే అలర్ట్స్ వినపడటం, పరుగెత్తడం కష్టమవుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని 'కెన్ ఐ షవర్'ను ఉపయోగిస్తున్నారు. ఇది అధికారిక భద్రతా వ్యవస్థ కాకపోయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో సహాయకారిగా ఉంటోంది. అయితే దీనిపై పూర్తిగా ఆధారపడలేమని ఇజ్రాయెల్ ప్రజలు చెబుతున్నారు. రాకెట్ అటాక్ ప్యాటర్న్స్, అలర్ట్ డేటాను పరిశీలించి ఈ యాప్ అవుట్‌పుట్ ఇస్తుంది.
Israel Iran War
Iran
Israel
Can I Shower app
rocket attacks
air sirens
bomb shelters

More Telugu News