క్యాబ్ డ్రైవర్ వేధింపులు.. ప్రాణభయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్యాబ్ డ్రైవర్ వేధింపులు.. ప్రాణభయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ!

Nainital Woman Harassment Woman Spends Night in Forest to Escape Cab Driver
  • నైనిటాల్ వెళ్తున్న మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక వేధింపులు
  • ప్రాణభయంతో అడవిలోకి పారిపోయి రాత్రంతా అక్కడే
  • స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
  • పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసుల గాలింపు
ఢిల్లీ నుంచి నైనిటాల్‌కు పర్యాటక యాత్రకు వెళ్లిన ఓ మహిళకు తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది. తాను ప్రయాణిస్తున్న క్యాబ్ డ్రైవరే లైంగికంగా వేధించడంతో ప్రాణభయంతో కారు దిగి అడవిలోకి పారిపోయింది. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ చీకటిలోనే గడిపిన ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో కలకలం సృష్టించింది.

ఢిల్లీకి చెందిన ఓ మహిళ నైనిటాల్ చూసేందుకు ఒక ప్రైవేట్ క్యాబ్‌ను బుక్ చేసుకుంది. ప్రయాణం మార్గమధ్యంలో ఉత్తరాఖండ్ అటవీ ప్రాంతంలోకి రాగానే డ్రైవర్ కారును నిర్మానుష్య ప్రదేశంలో ఆపాడు. అనంతరం ఆమెపై అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి ప్రయత్నించాడు. డ్రైవర్ ప్రవర్తనతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆ మహిళ సమయస్ఫూర్తితో కారులో నుంచి బయటపడి సమీపంలోని అడవిలోకి పరుగులు తీసింది.

రాత్రంతా ఎలాంటి సాయం లేకుండా చీకటి అడవిలోనే భయంతో గడిపింది. మరుసటి రోజు ఉదయం అటుగా వచ్చిన కొందరు స్థానికులు ఆమెను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని రక్షించి, ఆమె ఫిర్యాదు ఆధారంగా క్యాబ్ డ్రైవర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి డ్రైవర్ వాహనం సహా పరారీలో ఉన్నాడు. అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.  
Advertisement
Nainital Woman Harassment
Nainital
Uttarakhand
Cab driver
Sexual assault
Delhi woman
Forest
Crime
Police investigation

More Telugu News