తెలుగు రాష్ట్రాల్లో సివిల్స్ విజేతలు వీరే!
- యూపీఎస్సీ సివిల్స్ 2025 తుది ఫలితాల విడుదల
- వివిధ కేంద్ర సర్వీసులకు 958 మంది ఎంపిక
- ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచిన అనుజ్ అగ్నిహోత్రి
- సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు
- 23వ ర్యాంకు సాధించిన జశ్వంత్ చంద్ర
ఈసారి ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన అభ్యర్థులు తమ సత్తా చాటారు. దాదాపు 30 మందికి పైగా తెలుగు అభ్యర్థులు సివిల్స్‌లో విజయకేతనం ఎగురవేయడం విశేషం. ముఖ్యంగా ఆల్ ఇండియా 23వ ర్యాంకుతో జీను శ్రీ జస్వంత్ చంద్ర, 55వ ర్యాంకుతో గుడెల్లి సృజన (పెద్దపల్లి జిల్లా) ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంకర్లుగా నిలిచారు. వీరిద్దరూ ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతుండటం గమనార్హం.
ఇక ఇతర తెలుగు అభ్యర్థుల్లో పోలవరపు ధ్వనీష్ (108), అట్ల తరుణ్ తేజ (123), శ్రీగిరిరాజు వి.పి.ఎస్. సాయి కృష్ణ (125), కొలిపాక శ్రీకృష్ణ సాయి (150), బానోత్ లక్ష్మి రచన (178), ఎస్. వర్షిత్ రెడ్డి (259), మాసమ్మగారి పవన్ కుమార్ రెడ్డి (297) మంచి ర్యాంకులు సాధించారు. అలాగే వెలిమినేటి విక్రమ్ సింహా రెడ్డి (541), గుమ్మల శ్వేత (573), వెలిమినేటి విజయసింహ రెడ్డి (682), పుడారి రాహుల్ (748), కత్తిమాని అనిరుధ్ (786), కొరపోతుల శ్రీకర్ రాజు (806), ఇస్లావత్ శ్రీరామ్ హర్ష (823), కట్టా ప్రత్యూష (908), రాజశేఖర్ గోగుల (920), గుగోలత్ జితేందర్ నాయక్ (939) కూడా విజేతల జాబితాలో నిలిచారు. లక్షలాది మంది పోటీపడే ఈ పరీక్షలో తెలుగు యువత ఈ స్థాయి విజయాలు సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పూర్తి ఫలితాల జాబితాను upsc.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.