టీటీడీ కొత్త ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర
- రవిచంద్ర చేత ఈవోగా ప్రమాణస్వీకారం చేయించిన ఏఈవో వెంకయ్య చౌదరి
- శ్రీవారి సన్నిధిలో బంగారు వాకిలి వద్ద ప్రమాణస్వీకారం
- ఈ అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని వ్యాఖ్య
వేద పండితుల ఆశీర్వచనం అనంతరం రవిచంద్ర మాట్లాడుతూ... శ్రీవారికి సేవ చేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమని ఆనందం వ్యక్తం చేశారు. సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లలో పారదర్శకత పెంచుతామని చెప్పారు. తనకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.