సుఖోయ్ మిస్సింగ్ కథ విషాదాంతం
- అసోంలో కూలిన యుద్ధ విమానం
- వాయుసేన పైలట్లు ఇద్దరూ దుర్మరణం
- పైలట్ల కుటుంబాలకు ఐఏఎఫ్ సంతాపం
అసలేం జరిగిందంటే..
జోర్హాట్ ఎయిర్‌బేస్ నుంచి పైలట్ల శిక్షణలో భాగంగా గురువారం సాయంత్రం టేకాఫ్ అయిన ఈ యుద్ధ విమానం కొద్దిసేపటికే రాడార్ సంబంధాలను కోల్పోయింది. దీంతో విమానం జాడ కనిపెట్టేందుకు వాయుసేన గాలింపు చర్యలు చేపట్టింది. చివరకు జోర్హాట్కు 60 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు.
ఈ ప్రమాదంలో మరణించిన పైలట్ల కుటుంబాలకు వాయుసేన సంతాపం తెలిపింది. ‘‘పైలట్ల కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ కష్టకాలంలో వాయుసేన ఆ కుటుంబాలకు అండగా ఉంటుంది’’ అని ఐఏఎఫ్ తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొంది. ఈ ప్రమాదంపై వాయుసేన ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపింది. విమానం కూలిపోవడానికి కారణం సాంకేతిక లోపమా? లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అన్నది దర్యాప్తులో తేలనుంది.