Vangalapudi Anitha: ఏపీ అసెంబ్లీలో అస్వస్థతకు గురైన హోంమంత్రి అనిత
- ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు అస్వస్థత
- అసెంబ్లీ సమావేశాల సమయంలో నలతగా ఉండటంతో ఆసుపత్రికి తరలింపు
- గత వారం రోజులుగా తీరికలేని షెడ్యూలే కారణమని సమాచారం
- ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన వ్యక్తిగత సిబ్బంది
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అస్వస్థతకు గురయ్యారు. నేడు అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆమెకు స్వల్పంగా నలతగా అనిపించడంతో, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనితకు రక్తపోటు (బీపీ) పెరిగినట్టు వైద్యులు తెలిపారు.
ఈ రోజు ఉదయం నుంచి అనిత శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ప్రధానంగా తిరుమల లడ్డూ వ్యవహారంపై జరిగిన చర్చలో కూడా ఆమె భాగమయ్యారు. మండలి సమావేశాలు వాయిదా పడిన తర్వాత, అసెంబ్లీ కొనసాగుతున్న సమయంలో ఆమె అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
గత వారం రోజులుగా అసెంబ్లీ సమావేశాలు, వరుస కార్యక్రమాలతో హోంమంత్రి తీరిక లేకుండా గడుపుతున్నారు. నిరంతర పని ఒత్తిడి, సరైన విశ్రాంతి లేకపోవడం వల్లే ఆమె నీరసించిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
హోంమంత్రి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె వ్యక్తిగత సిబ్బంది స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించినట్లు సమాచారం. అంతా సవ్యంగా ఉంటే ఈ రోజు సాయంత్రానికే ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.