కాలక్రమంలో మేం పెద్దవాళ్ళమవుతున్నాం: విజయ్ దేవరకొండ
- తెలుగు మీడియాను మర్యాదపూర్వకంగా కలిసిన విజయ్, రష్మిక జంట
- కొత్త కోడలు వచ్చింది బాగా చూసుకోండని సరదాగా అన్న విజయ్ దేవరకొండ
- మీడియాను ఎప్పటికీ మరిచిపోమన్న విజయ్ దేవరకొండ
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు వచ్చింది, బాగా చూసుకోండని సరదాగా అన్నారు. మా సినిమా ప్రయాణంలో మీడియా కూడా ఒక భాగమని తెలిపారు. పెళ్లి చేసుకుని ఇప్పుడు జంటగా మీ ముందుకు వచ్చామని అన్నారు. ఇదో విభిన్న అనుభూతి సమయం అని, క్రమంగా తాము ఎదుగుతూ, కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని అన్నారు.
మీడియాను మాత్రం ఎప్పటికీ మరిచిపోబోమని పేర్కొన్నారు. మీకు మా హృదయాల్లో ఎప్పటికీ చోటు ఉంటుంది అని అన్నారు. మీ ఆశీస్సులు మాకు కావాలని విజయ్ దేవరకొండ అన్నారు. మేం కొత్త జీవితంలోకి అడుగు పెట్టామని రష్మిక మందన్న అన్నారు.