Ram Charan: ' పెద్ది' అంటే ఇది: పదునైన పాటలో పవర్ఫుల్ స్టెప్పులు!
- 'పెద్ది'గా అలరించనున్న చరణ్
- 'రై రై' లిరికల్ సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్
- రెహ్మాన్ నుంచి తిరుగులేని ఫాస్ట్ బీట్
- బీట్ కి తగిన ఘాటును జోడించిన జానీ మాస్టర్
- సాహిత్యం పరంగా మార్కులు కొట్టేసిన అనంత్ శ్రీరామ్
చరణ్ కి మాస్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన ఎంచుకున్న సినిమాల కారణంగా, అభిమానులు కోరుకుంటున్న రీతిలో ఆయన కనిపించలేదు. తాము ఆశిస్తున్నట్టుగా చరణ్ ఎప్పుడు స్క్రీన్ పై కనిపిస్తాడా? పవర్ఫుల్ స్టెప్పులతో ఎప్పుడు రెచ్చిపోతాడా? అని వాళ్లంతా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' సినిమాను చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి 'రైరై రారా' అనే పాటకి సంబంధించిన లిరికల్ వీడియోను వదిలారు.
ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఈ సాంగ్ ను గురించి మాట్లాడుకుంటున్నారు. చరణ్ అభిమానులు తమ ఆకలిదప్పులు తీరినట్టుగా సేదదీరుతున్నారు. ఏఆర్ రెహ్మాన్ ట్యూన్ .. ఆయనే ఈ పాటను స్వయంగా ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో వినిపించేది .. కనిపించేది .. మురిపించేది వేగమే. అందుకే అనంత శ్రీరామ్ 'రై రై' అంటూ వేగానికి సంబంధించిన శబ్ద ప్రయోగంతో ఈ పాటను మొదలుపెట్టడం విశేషంగా అనిపిస్తుంది. చిన్నచిన్న తేలికైన మాటలను అర్థం పరంగా పదునుగా వాడిన విధానం పాటకి మరింత ఊపు తెచ్చింది.
పాటలో సాహిత్యం మధ్యలో వచ్చే బీట్ ను జానీ మాస్టర్ ఎంతమాత్రం వేస్ట్ చేయలేదు. ఏకధాటిగా చరణ్ వేసిన స్టెప్పులు అలా చూస్తుండిపోయేలా చేస్తాయి. చరణ్ ఎనర్జీని .. ఆ స్టెప్పులు అంతగా సాధన చేయడానికి ఆయన పడిన కష్టాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఇక చరణ్ నుంచి ఆయన అభిమానులకు ఏం కావాలో తెలిసిన జానీ మాస్టర్, మరో తిరుగులేని ఫాస్ట్ బీట్ ను కరిగిపోని కానుకగా ఇచ్చాడు. రెహ్మాన్ చాలా కాలం తరువాత ఇచ్చిన గొప్ప ట్యూన్ గా కూడా చెప్పుకోవచ్చు. బీట్ .. డాన్స్ .. సాహిత్యం .. ఇలా అన్నీ కలిసిన ఈ పాట, 'పెద్ది' సినిమాను మరింత అందలం ఎక్కించిందనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమైపోతోంది.