పోలవరం జిల్లాలో పెద్దపులి కలకలం .. రంగంలోకి శ్రీశైలం బృందం
- పోలవరం జిల్లా గంగవరం మండలంలో పెద్దపులి సంచారం
- కుసుమరాయి పరిసరాల్లో పులి తిరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన
- నాలుగు ప్రత్యేక బృందాలతో ఇప్పటికే నిఘా పెట్టిన అటవీ శాఖ
- పరిస్థితిని సమీక్షించేందుకు శ్రీశైలం నుంచి వస్తున్న మరో బృందం
- రాత్రిపూట గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన
పులి సంచారం దృష్ట్యా గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లేవారు, ఒంటరిగా బయట తిరిగేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ నేతృత్వంలో ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పులి జాడను గుర్తించేందుకు నిరంతర నిఘా కొనసాగుతోందని, ప్రజలు ఆందోళన చెందవద్దని, అధికారులకు సహకరించాలని కోరారు.