Vijay Deverakonda: కళ్లు చెదిరేలా 'విరోష్' జంట సంగీత్ వేడుక... వైరల్ అవుతున్న ఫొటోలు ఇవిగో!
- ఇటీవల పెళ్లితో ఒక్కటైన విజయ్ దేవరకొండ-రష్మిక
- తాజాగా సంగీత్ ఫొటోలు విడుదల
- ఆ రాత్రి తాము ఆపకుండా డ్యాన్స్ చేస్తూనే ఉన్నామని రష్మిక వెల్లడి
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు ముగిసినా, ఆ సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. 'విరోష్' జంటగా అభిమానులు పిలుచుకునే ఈ ఇద్దరూ, తాజాగా తమ సంగీత్ వేడుకకు సంబంధించిన అద్భుతమైన ఫొటోలను విడుదల చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.
ఫిబ్రవరి 24న ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ వేదికగా ఈ సంగీత్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆ రాత్రి ప్రేమ, ఆనంద బాష్పాలు, నవ్వులు, సంగీతం, మెరుపులతో నిండిపోయిందని రష్మిక తన పోస్ట్‌లో పేర్కొన్నారు. "ఆ రాత్రి మేం ఆపకుండా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాం. నా జీవితంలోనే అది అత్యంత ఫన్‌తో కూడిన రాత్రి" అని రష్మిక రాసుకొచ్చారు. ఈ వేడుకలో తామిద్దరం ఒకరికొకరు సర్ ప్రైజ్ లు ప్లాన్ చేసుకున్నామని, అయితే కుటుంబ సభ్యులు కూడా తమ కోసం డ్యాన్స్ చేసి ఆశ్చర్యపరిచారని ఆమె తెలిపారు.
సంగీత్ వేడుకలో రష్మిక షిమ్మరింగ్ లెహంగాలో మెరిసిపోగా, విజయ్ రాయల్ అవుట్‌ఫిట్‌లో కనిపించారు. రష్మిక మొదట ఆనంద్ దేవరకొండతో స్టెప్పులేయగా, ఆ తర్వాత విజయ్ ఆమె కోసం స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చివరగా విరోష్ జంట చేసిన రొమాంటిక్ డ్యాన్స్ ఈ వేడుకకే హైలైట్‌గా నిలిచింది. కాగా, ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగగా, మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.