Vasudeva Reddy: ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. వాసుదేవరెడ్డి అరెస్ట్

Vasudeva Reddy Arrested in AP Liquor Scam
  • ఏపీబీసీఎల్ మాజీ ఎండి వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసిన సీఐడీ
  • ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, కీలక పత్రాలు చోరీ చేశారంటూ కేసు నమోదు
  • ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న వాసుదేవరెడ్డి 

ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మరో అరెస్ట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) మాజీ ఎండీ, ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కాంకు సంబంధించి విజయవాడలోని ఏపీబీసీఎల్ కార్యాలయం నుంచి ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, కీలక పత్రాలను చోరీ చేశారంటూ ఆయనపై ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో ఆయనపై ఆధారాల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర అభియోగాలతో 2024 జూన్‌లో కేసు నమోదు అయింది. ఈ కేసులో ఆయన ఏ2గా ఉన్నారు.


హైదరాబాద్‌లోని తన నివాసంలో సీఐడీ సోదాలకు వెళ్లిన సమయంలో వాసుదేవరెడ్డి పరారయ్యారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉండగా... తాజాగా సీఐడీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

Vasudeva Reddy
AP Liquor Scam
Andhra Pradesh Beverages Corporation
APBCL
CID
Liquor Case Arrest
Vijayawada
YSRCP
IRTS Officer
Document Theft

More Telugu News