Narendra Modi: సలహాలన్నీ తీసుకోవాలి.. కానీ సరిపోయేది ఎంచుకోవాలి: మోదీ

Narendra Modi on Exam Preparation and Skill Development
షార్ట్స్‌లో చూడండి
‘‘సలహాలు అన్నీ తీసుకోవాలి కానీ మనకు సరిపోయే సలహానే ఎంచుకోవాలి” అని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు సూచించారు. చదువు, విశ్రాంతి, అలవాట్లు, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంలో ఒక బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఆటలను సరదాగా తీసుకోవద్దని, అదొక నైపుణ్యమని హితవు పలికారు. ఈ మేరకు ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ విద్యార్థులతో ముచ్చటించారు.

పనితీరుకు సంబంధించి ప్రజలు తనకు ఎన్నో విషయాలు చెబుతుంటారని, వారు ఇచ్చే సలహాలు అన్నీ దేశ ప్రధానిగా తాను స్వీకరిస్తానని మోదీ చెప్పారు. ఇలా స్వీకరించిన సలహాలు సూచనలతోనే తన పనివేళల్లో మార్పులు చేసుకున్నట్లు విద్యార్థులకు వివరించారు. అయితే, తాను విలువలను మాత్రం వదులుకోలేదని వివరించారు. ఈ సందర్భంగా జూదం జోలికి వెళ్లవద్దని వారిని హెచ్చరించారు. ఇంటర్నెట్‌ తక్కువ ధరకే లభిస్తుందని సమయం వృథా చేసుకోద్దని హితవు పలికారు. పరీక్షలను పండుగలా చేసుకోవాలని, మీతో మీరే పోటీపడాలని మోదీ వారికి సూచనలు చేశారు.
Go Back to Shorts
Narendra Modi
Pariksha Pe Charcha
Student Advice
Exam Tips
Prime Minister Modi
Education
Skills Development
Internet Usage
Student Life

More Telugu News