Ahmed Pasha Quadri: ఎంఐఎం పార్టీలో విషాదం.. సీనియర్ నేత అహ్మద్ పాషా ఖాద్రీ కన్నుమూత
- హైదరాబాద్‌లోని ఓవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
- గత రెండేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సీనియర్ నేత
- చార్మినార్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పాషా ఖాద్రీ
ఎంఐఎం పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. పార్టీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (72) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఓవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
గత రెండేళ్లుగా అనారోగ్యంతో ఉన్న పాషా ఖాద్రీ, 2025 నవంబర్ 30న అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఓవైసీ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మరణించారు.
అహ్మద్ పాషా ఖాద్రీకి ఏఐఎంఐఎం పార్టీలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన చార్మినార్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2009, 2014, 2018 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీకి అత్యంత సన్నిహితుడిగా, నమ్మకమైన సహచరుడిగా పేరుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు, యువ నాయకత్వానికి అవకాశం కల్పిస్తూ ఆయన యాకుత్‌పురా సీటు నుంచి తప్పుకున్నారు.
దశాబ్దాలుగా పార్టీ జనరల్ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన పాషా ఖాద్రీ మరణంతో పాతబస్తీ రాజకీయాల్లో, ముఖ్యంగా ఎంఐఎం పార్టీలో తీరని లోటు ఏర్పడింది. ఆయన మృతి పట్ల పార్టీ శ్రేణులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.