Jagtial accident: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Jagtial Accident Four Agricultural Workers Died
  • ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో వ్యవసాయ కూలీలు మృతి
  • పసుపు కోతకు వెళ్లి వస్తుండగా నీటి గుంతలో పడిన ట్రాక్టర్
  • గాయపడిన వారు సమీపంలోని ఆసుపత్రికి తరలింపు
జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. వ్యవసాయ కూలీలు ఉదయం పసుపు కోతకు వెళ్లారు. పసుపు కోత పూర్తయ్యాక తిరిగి వస్తుండగా మల్లాపూర్ మండలం ముగిలిపేట వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపు తప్పి నీటి గుంతలో బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

More Telugu News

Jagtial accident
Jagtial district
Road accident
Tractor accident
Agricultural workers
Mugilipeta