Nirmala Sitharaman: మొత్తం బడ్జెట్ ఎంత.. ఏ రంగానికి ఎంతెంత..?
- 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్
- మూలధన వ్యయాన్ని రూ.12.2 లక్షల కోట్లకు పెంచిన కేంద్ర ప్రభుత్వం
- బయోఫార్మా, ఎంఎస్ఎంఈ రంగాలకు చెరో రూ.10,000 కోట్ల నిధులు
- వ్యక్తిగత అవసరాల దిగుమతులపై కస్టమ్స్ సుంకం 10 శాతానికి తగ్గింపు
- ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టం
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. యువశక్తిని చోదకశక్తిగా చేసుకుని, పేదలు, అణగారిన వర్గాల ప్రగతి లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆమె తెలిపారు. మొత్తం రూ.53.5 లక్షల కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన ఈ బడ్జెట్‌లో స్థిరమైన ఆర్థిక వృద్ధి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' దార్శనికతతో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం అనే మూడు ప్రధాన కర్తవ్యాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
ప్రధాన కేటాయింపులు, ఆర్థిక అంచనాలు
2026-27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యయం రూ.53.5 లక్షల కోట్లుగా అంచనా వేయగా, మొత్తం రాబడులు (అప్పులు మినహా) రూ.36.5 లక్షల కోట్లుగా ఉంటాయని బడ్జెట్‌లో పేర్కొన్నారు. కేంద్ర నికర పన్ను రాబడులు రూ.28.7 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ద్రవ్యలోటును జీడీపీలో 4.3 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 2025-26 సవరించిన అంచనాల్లో ద్రవ్యలోటు 4.4 శాతంగా ఉంది. స్థూల మార్కెట్ రుణాలు రూ.17.2 లక్షల కోట్లుగా ఉంటాయని తెలిపారు.
మౌలిక సదుపాయాలకు భారీ కేటాయింపులు
దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది. ప్రభుత్వ మూలధన వ్యయాన్ని (పబ్లిక్ క్యాపెక్స్) గత ఏడాది రూ.11.2 లక్షల కోట్ల నుంచి ఈసారి రూ.12.2 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ భారీ నిధులతో దేశవ్యాప్తంగా పలు కీలక ప్రాజెక్టులకు ఊతం లభించనుంది. ఇందులో భాగంగా పర్యావరణ అనుకూల ప్రయాణ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు ఏడు హై-స్పీడ్ రైల్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. వీటిలో ముంబై-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్లు ఉన్నాయి. దీంతో పాటు తూర్పున డంకుని నుంచి పశ్చిమాన సూరత్ వరకు కొత్త ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
మంత్రిత్వ శాఖల వారీగా కేటాయింపుల వివరాలు:
1.ఆర్థిక మంత్రిత్వ శాఖ (Ministry of Finance): ఈ బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు పొందింది ఆర్థిక శాఖే. ఈ శాఖకు మొత్తం రూ. 19.72 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 17.22 లక్షల కోట్లు కాగా, మూలధన వ్యయం రూ. 2.50 లక్షల కోట్లుగా ఉంది. ఈ నిధులు ప్రధానంగా వడ్డీ చెల్లింపులు, వివిధ సబ్సిడీలు, రాష్ట్రాలకు బదిలీ చేయాల్సిన నిధుల కోసం వినియోగిస్తారు. ఈ బడ్జెట్‌లో ద్రవ్యలోటును జీడీపీలో 4.3%గా లక్ష్యంగా నిర్దేశించారు.
2.రక్షణ మంత్రిత్వ శాఖ (Ministry of Defence): కేటాయింపుల్లో రక్షణ శాఖ రెండో స్థానంలో నిలిచింది. ఈ శాఖకు రూ. 7.85 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 5.54 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ. 2.31 లక్షల కోట్లు. సైనిక ఆధునీకరణ, ఆపరేషనల్ సంసిద్ధత, మాజీ సైనికుల పెన్షన్లు, కొత్త విమానాలు, నౌకాదళ ప్లాట్‌ఫామ్‌లు, అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్ కొనుగోలుకు ఈ నిధులను వెచ్చిస్తారు. ముఖ్యంగా 'ఆత్మనిర్భర్ భారత్' కింద దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యం ఇచ్చారు.
3.రహదారులు, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (Ministry of Road Transport and Highways): మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ ఈ శాఖకు రూ. 3.10 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో ఎక్కువ భాగం మూలధన వ్యయమే కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం, లాజిస్టిక్స్ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.
4.రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways): భారతీయ రైల్వేల అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో రూ. 2.81 లక్షల కోట్లు కేటాయించారు. రైల్వే నెట్‌వర్క్ విస్తరణ, స్టేషన్ల పునరాభివృద్ధి, ప్రయాణికుల భద్రత, సౌకర్యాల మెరుగుదలకు ఈ నిధులను ఉపయోగిస్తారు.
5.హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs): దేశ అంతర్గత భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ హోం శాఖకు రూ. 2.55 లక్షల కోట్లు కేటాయించారు. సరిహద్దుల నిర్వహణ, పోలీసు బలగాల ఆధునీకరణ, సైబర్ భద్రత వంటి కీలక అంశాలకు ఈ నిధులను ఖర్చు చేస్తారు.
6.వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ (Ministry of Consumer Affairs, Food and Public Distribution): ఈ శాఖకు రూ. 2.39 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో అధిక మొత్తం ఆహార సబ్సిడీలు, ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) నిర్వహణ కోసం వినియోగిస్తారు.
7.గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ. 1.97 లక్షల కోట్లు కేటాయించారు. గ్రామీణ గృహ నిర్మాణ పథకాలు, ఉపాధి హామీ, ఇతర జీవనోపాధి పథకాల అమలుకు ఈ నిధులు తోడ్పడతాయి.
8.రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ (Ministry of Chemicals and Fertilizers): రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఎరువుల సబ్సిడీల కోసం ఈ శాఖకు రూ. 1.77 లక్షల కోట్లు కేటాయించారు.
9.వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ (Ministry of Agriculture and Farmers' Welfare): రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో ఈ శాఖకు రూ. 1.40 లక్షల కోట్లు కేటాయించారు. అగ్రి-టెక్, 'భారత్-విస్తార్' వంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగంలో సాంకేతికతను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టారు.
10. విద్యా మంత్రిత్వ శాఖ (Ministry of Education): పాఠశాల విద్య, ఉన్నత విద్య, పరిశోధనల కోసం విద్యాశాఖకు రూ. 1.39 లక్షల కోట్లు కేటాయించారు.
11. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (Ministry of Health and Family Welfare): ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్య శాఖకు రూ. 1.07 లక్షల కోట్లు కేటాయించారు. దేశంలో హెల్త్‌కేర్ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి.
12. జల్ శక్తి మంత్రిత్వ శాఖ (Ministry of Jal Shakti): తాగునీరు, పారిశుధ్యం, సాగునీటి ప్రాజెక్టుల కోసం ఈ శాఖకు రూ. 94,800 కోట్లు కేటాయించారు.
13. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Housing and Urban Affairs): పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఈ శాఖకు రూ. 85,522 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు.
పన్నులు, ఇతర ప్రతిపాదనలు
పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కల్పించేందుకు పలు సంస్కరణలు ప్రతిపాదించారు. ఏప్రిల్ 2026 నుంచి 'కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025' అమల్లోకి రానుంది. విదేశీ పర్యటన ప్యాకేజీలపై టీసీఎస్ రేటును 2 శాతానికి తగ్గించారు. వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 20% నుంచి 10%కి తగ్గించడం ద్వారా సామాన్యులకు ఊరట కల్పించారు.
క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే 17 రకాల మందులపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు. మరోవైపు, ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ)ని 0.02% నుంచి 0.05%కి పెంచారు. మొత్తం మీద ఈ బడ్జెట్, దీర్ఘకాలిక వృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా మౌలిక వసతులు, తయారీ రంగాలపై దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.