KCR: రేపు కేసీఆర్ సిట్ విచారణ... రాష్ట్రవ్యాప్త నిరసనలకు కేటీఆర్ పిలుపు

KCR SIT Inquiry KTR Calls for Statewide Protests
  • శాంతియుతంగా నిరసన చేపట్టాలన్న కేటీఆర్
  • మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొనాలని పిలుపు
  • పోలీసులతో ఘర్షణలకు దిగవద్దని సూచన
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను విచారణ పేరుతో ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని బీఆర్ఎస్ రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.

రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రభుత్వం దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని, ప్రతి మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు శాంతియుతంగా చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఆందోళనల్లో పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నిరసనలు శాంతియుతంగా చేపట్టాలని, పోలీసులతో ఘర్షణలకు దిగవద్దని సూచించారు.

కాగా, కేసీఆర్ రేపు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరు కానున్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం ఆయన విచారణకు హాజరు కావాలని నిర్ణయించారు. నందినగర్‌లోని నివాసంలో సిట్ ఆయనను విచారించనుంది. 
KCR
KCR SIT Inquiry
KTR
BRS Protests
Telangana Politics
BRS Party
Statewide Protests

More Telugu News