Dharmapuri Arvind: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ భేటీ

Dharmapuri Arvind Meets Minister Komatireddy Venkat Reddy
  • మాధవ్ నగర్ ఆర్ఓబీకి సవరించిన రూ.8.68 కోట్లు మంజురు చేయాలని కోరినట్లు వెల్లడి
  • తక్షణమే స్పందించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్న ఎంపీ
  • మంత్రి సానుకూలంగా స్పందించారంటూ ధన్యవాదాలు తెలిపిన అరవింద్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సమావేశమయ్యారు. నియోజకవర్గానికి సంబంధించిన ఒక పని నిమిత్తం తాను మంత్రిని కలిశానని, దానికి ఆయన సానుకూలంగా స్పందించారంటూ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన విషయాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

గత 15 నెలలుగా పెండింగ్‌లో ఉన్న మాధవ్ నగర్ ఆర్ఓబీ 193కి సవరించిన అదనపు రూ.8.68 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని తాను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశానని ఆయన పేర్కొన్నారు. తన విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. తక్షణమే మంజూరు ఉత్తర్వులను జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారని వెల్లడించారు.
Dharmapuri Arvind
Komatireddy Venkat Reddy
Telangana Minister
Nizamabad MP
Madhava Nagar ROB

More Telugu News