Indian Immigrants: బోర్డర్ దాటే ప్రయత్నంలో అమెరికా పోలీసులకు పట్టుబడుతున్న భారతీయులు

US Border Patrol Arrests Indian Immigrants Every 20 Minutes
  • అక్రమంగా అమెరికాలో అడుగుపెడుతున్న వారిలో భారతీయులే ఎక్కువట
  • గతేడాది 23 వేల మందిని అరెస్టు చేసిన అమెరికా పోలీసులు
  • ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక మరింత కఠినంగా చట్టాల అమలు
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వలసదారుల్లో భారతీయుల సంఖ్యే ఎక్కువని తాజా నివేదికల్లో బయటపడింది. అక్రమంగా సరిహద్దులు దాటి పెద్ద సంఖ్యలో భారతీయులు పట్టుబడుతున్నారని తేలింది. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ పోలీస్ నివేదిక ప్రకారం.. గతేడాది సగటున ప్రతీ 20 నిమిషాలకు ఓ భారతీయుడిని అరెస్టు చేసినట్లు సమాచారం. మొత్తంగా 2025 లో 23,830 మంది భారతీయులు సరిహద్దుల వద్ద పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. 2024 ఏడాదిలో ఇదేవిధంగా 85,119 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు.

కాగా, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక ఇమ్మిగ్రేషన్ చట్టాలను కఠినంగా మార్చిన విషయం తెలిసిందే. అక్రమ వలసలపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని బోర్డర్ పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాలావరకు అక్రమ వలసలను అధికారులు కట్టడి చేశారు. శిక్షలకు భయపడి బోర్డర్ దాటేందుకు చాలామంది సాహసించడంలేదు. అయినప్పటికీ భారతీయులు మాత్రం ఎలాగైనా అమెరికాలో అడుగుపెట్టాలని బోర్డర్ క్రాస్ చేసేందుకు తెగిస్తున్నారని ఆరోపించారు. 

యువతే ఎక్కువ..
బోర్డర్ దాటుతూ పట్టుబడ్డ భారతీయుల్లో యువతే ఎక్కువని, ఉద్యోగం కోసం, మంచి వేతనం కోసం వారు ఈ సాహసానికి పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. మరోవైపు, సరిహద్దుల్లో తల్లీతండ్రులు లేకుండా పిల్లలు మాత్రమే పట్టుబడుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Indian Immigrants
US Border
illegal immigration
US Customs and Border Protection
border arrests
Donald Trump immigration policy
human trafficking
undocumented workers
America
border security

More Telugu News