Chiranjeevi: చిరు, వెంకీ మాస్ స్టెప్పులు.. ‘అదిరిపోద్ది సంక్రాంతి’ ఫుల్ వీడియో వచ్చేసింది!

Chiranjeevi and Venkatesh Mass Steps Adiripoddi Sankranthi Full Video Released
  • ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ చిత్రంలోని ‘అదిరిపోద్ది సంక్రాంతి’ సాంగ్ విడుదల
  • భీమ్స్ సంగీతంలో కాసర్ల శ్యామ్ రాసిన మాస్ గీతం
  • సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన మెగా విక్టరీ సాంగ్
అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కలిసి తెరపై కనిపిస్తే అభిమానులకు కనుల పండుగే. అలాంటిది వారిద్దరూ కలిసి మాస్ స్టెప్పులేస్తే ఆ సందడి రెట్టింపు అవుతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ చిత్రంలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన వెంకటేశ్.. చిరంజీవితో కలిసి ‘అదిరిపోద్ది సంక్రాంతి’ అనే పాటలో సందడి చేశారు. తాజాగా ఈ ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ పూర్తి వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రంలో చిరు, వెంకీ కలిసి చేసిన ఈ ప్రత్యేక గీతం కీలక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన ఊపునిచ్చే సంగీతానికి, గీత రచయిత కాసర్ల శ్యామ్ మాస్ పల్స్ తెలిసిన సాహిత్యాన్ని అందించారు. గాయకులు నకాశ్‌ అజీజ్‌, విశాల్‌ దడ్లానీ తమ ఎనర్జిటిక్ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. థియేటర్లలో అభిమానులను ఉర్రూతలూగించిన ఈ పాట పూర్తి వీడియో కోసం ఎదురుచూస్తున్న వారికి చిత్ర యూనిట్ ట్రీట్‌ అందించింది.

ప్రస్తుతం ఈ ఫుల్ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇద్దరు లెజెండ్స్ మధ్య కెమిస్ట్రీ, వారి గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘అదిరిపోద్ది సంక్రాంతి’ అంటూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

Chiranjeevi
Venkatesh
Adiripoddi Sankranthi
Mana shankaravaraprasad garu
Anil Ravipudi
Bheems Ceciroleo
Kasarla Shyam
Telugu movie song

More Telugu News