urea shortage: యూరియా కోసం రాత్రంతా చలిలో రైతుల ఎదురుచూపులు.. వీడియో ఇదిగో!

Urea Shortage Forces Farmers to Wait Overnight in Nagar Kurnool
  • నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో ఘటన
  • రైతు వేదిక వద్ద దుప్పట్లు కప్పుకుని రైతుల జాగారం
  • అధికారుల ప్రకటనలే తప్ప క్షేత్రస్థాయిలో యూరియా దొరకట్లేదని విమర్శలు
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం రైతులు రాత్రంతా చలిలో జాగారం చేశారు. శుక్రవారం మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో మండల కేంద్రానికి చేరుకుని క్యూ కట్టారు. స్వెట్టర్లు, దుప్పట్లతో రాత్రిపూట రైతు వేదిక వద్ద రైతులు క్యూలో ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు యూరియాకు కొరతలేదని ప్రకటన చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. అధికారుల ప్రకటనల్లో నిజం లేదని, క్షేత్రస్థాయిలో యూరియా దొరకడం లేదని రైతులు ఆరోపించారు. రెండు మూడు బస్తాల కోసం రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే యూరియా బస్తాల కోసం రైతు వేదిక వద్ద క్యూ కట్టామని తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు క్యూలో ఉన్నారు. మహళా రైతులు, యువకులు కూడా యూరియా బస్తాల కోసం చలిలో జాగారం చేయడం వీడియోలో చూడొచ్చు.

urea shortage
Nagar Kurnool Farmers
urea fertilizer
Telangana farmers
Bijinepally
farmer protest
fertilizer subsidy
agriculture news
farmer issues
Telangana agriculture

More Telugu News