Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు ట్రీట్.. 'శశిరేఖ' వీడియో సాంగ్ చూశారా?

Chiranjeevi Shashirekha video song released from Manashankaravaraprasadugaru
  • 'మన శంకరవరప్రసాద్‌ గారు' చిత్రం నుంచి కొత్త అప్‌డేట్
  • ఎంతగానో ఎదురుచూస్తున్న 'శశిరేఖ' ఫుల్ వీడియో సాంగ్ విడుదల
  • పాటలో చిరంజీవి, నయనతార మధ్య కెమిస్ట్రీ హైలైట్
  • భీమ్స్ సిసిరోలియో సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యం
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘శశిరేఖ’ ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ సినిమా నుంచి విడుదలైన ఈ మెలోడీ సాంగ్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం పాటకు ప్రాణం పోశాయి. భీమ్స్, మధుప్రియ ఆలపించిన ఈ గీతానికి భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో ఈ ఫుల్ వీడియో సాంగ్ విడుదల మెగా అభిమానులకు మంచి ట్రీట్ అని చెప్పాలి.

Chiranjeevi
Mana Shankaravaraprasad Garu
Shashirekha song
Nayanthara
Anil Ravipudi
Bheems Ceciroleo
Telugu songs
Mega fans
Sankranthi movies
Telugu cinema

More Telugu News