Mrunal Thakur: చరణ్ 'పెద్ది'లో మృణాల్ స్పెషల్ సాంగ్

Mrunal Thakur in Ram Charans Peddi Special Song with AR Rahman Tune
  • ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించినట్లు సమాచారం
  • పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో మృణాల్ అంగీకరించినట్లు టాక్
  • ఈ పాటకు ఏఆర్ రెహమాన్ హుషారైన ట్యూన్ సిద్ధం చేసినట్లు వార్తలు
'సీతా రామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి మృణాల్ ఠాకూర్, ఇప్పుడు ఓ భారీ చిత్రంలో ప్రత్యేక గీతంలో అలరించనున్నారనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'లో ఆమె ఓ ఐటెం సాంగ్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఈ పాట కోసం చిత్ర నిర్మాతలు ఇప్పటికే మృణాల్‌ను సంప్రదించారని, ఇది ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఆమె వెంటనే అంగీకరించినట్లు సమాచారం. ఈ ప్రత్యేక గీతాన్ని భారీ హంగులతో, అద్భుతమైన సెట్‌లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం సంగీత ద‌ర్శ‌కుడు ఏ.ఆర్. రెహమాన్ ఇప్పటికే ఓ హుషారైన ట్యూన్‌ను సిద్ధం చేశారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఇటీవలి కాలంలో అగ్ర కథానాయికలు ప్రత్యేక గీతాల్లో నటించడం ఒక ట్రెండ్‌గా మారింది. తక్కువ రోజుల కాల్షీట్లకు భారీ పారితోషికం లభించడంతో పాటు, యువతలో ఇలాంటి పాటలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్‌కు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మృణాల్ హిందీ, తెలుగు భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో రానున్న పాన్ వరల్డ్ చిత్రంలో కూడా ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Mrunal Thakur
Ram Charan
Peddi
AR Rahman
Item Song
Pan India Movie
Seetha Ramam
Telugu Cinema
Bollywood
Special Song

More Telugu News