Bochu Pedda Veerabhadradu: రామాలయానికి రూ.2 కోట్ల విరాళం ఇచ్చిన పిల్లలు లేని వృద్ధ దంపతులు
- నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జయదుర్గం గ్రామంలో జరిగిన ఘటన
- రూ.2కోట్ల విలువైన ఆస్తిని మాధవరం రామాలయానికి విరాళం అందజేసిన వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు
- గ్రామస్తులు దాతలను ఊరేగించి ఘనంగా సత్కరించిన వైనం
నంద్యాల జిల్లా, ప్యాపిలి మండలం, జయదుర్గం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. సంతానం లేని బొచ్చు పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు తమకు చెందిన సుమారు రూ. 2 కోట్ల విలువైన ఆస్తిని మాధవరం రామాలయానికి విరాళంగా అందజేశారు.
గ్రామ పెద్దల సమక్షంలో ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారికంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వృద్ధ దంపతుల సేవా నిరతిని కొనియాడుతూ, గ్రామంలో ఊరేగించి ఘనంగా సత్కరించారు.
గ్రామ పెద్దల సమక్షంలో ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారికంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వృద్ధ దంపతుల సేవా నిరతిని కొనియాడుతూ, గ్రామంలో ఊరేగించి ఘనంగా సత్కరించారు.