Rashmika Mandanna: రూమర్లు సృష్టించే వారిపై రష్మిక ఏమన్నారంటే..!
- అలాంటి వార్తలు ఎంతోమందిని పోషిస్తున్నాయి.. బతకనీలెమ్మని వదిలేస్తానన్న నటి
- ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషికం వార్తల్లో నిజంలేదని వివరణ
- చిట్ చాట్ లో అభిమానుల ప్రశ్నలకు జవాబిచ్చిన రష్మిక
పబ్లిక్ లైఫ్ లో ఉండే తారలపై రూమర్లు తప్పవని నటి రష్మిక మందన్న చెప్పారు. కొన్ని రూమర్లు ఎంతగానో బాధిస్తాయని తెలిపారు. అయితే, రూమర్లు సృష్టించే వారు కేవలం వ్యూస్ తో వచ్చే డబ్బు కోసమే ఆ పని చేస్తారని రష్మిక అన్నారు. ఓ చిట్ చాట్ లో అభిమానుల ప్రశ్నలకు జవాబులిస్తూ రష్మిక పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ‘‘మీడియాలో, సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కొంతమంది రూమార్లు సృష్టిస్తుంటారు.. నిజం చెప్పాలంటే ఆ వార్తలు కూడా ఎంతోమందిని పోషిస్తున్నాయి. అందుకే బతకనీ లెమ్మని వదిలేస్తా” అంటూ రష్మిక ఓ అభిమానికి జవాబిచ్చారు.
అన్ని భాషల్లో, అన్ని రకాల చిత్రాల్లో నటిస్తా..
2016 నుంచి ఇప్పటివరకూ ఒకేలా పనిచేస్తున్నానని రష్మిక చెప్పారు. అన్ని భాషల్లో, అన్ని రకాల చిత్రాల్లోనూ నటించాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చారు. భాషాపరమైన హద్దులు పెట్టుకోకుండా సినిమాలను ఎంచుకుంటున్నట్లు తెలిపారు. ఒక హీరోయిన్ గా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే తన పని అని, అందరికీ నచ్చేలా వైవిధ్యమైన చిత్రాలు చేయడానికి ప్రయత్నిస్తుంటానని వివరించారు.
ఇండస్ట్రీలో ఉన్నవారికి నెగెటివిటీ అనేది కామన్ అని రష్మిక చెప్పారు. నటులు అందరి పైనా ఎప్పుడూ ఏవేవో వార్తలు వస్తూనే ఉంటాయన్నారు. అయితే, ఏదో ఒకరోజు ప్రజలకు నిజం తెలుస్తుందనే ఉద్దేశంతోనే వాటిపై స్పందించడం లేదని వివరించారు. జీవితంలో జరిగిన ప్రతి విషయం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకుసాగుతున్నానని తెలిపారు.
పారితోషికంపై రూమర్లు..
ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి అంటూ తనపై వచ్చిన రూమర్లపై రష్మిక స్పందించారు. అది నిజమైతే బాగుండని తాను కూడా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. తాను హీరోయిన్ గా నటించే సినిమాల్లో ఐటెం సాంగ్ లు చేయడానికి సిద్ధమేనని చెప్పారు. ఇండస్ట్రీలోని ముగ్గురు డైరెక్టర్లు అడిగితే తాను హీరోయిన్ కాకున్నా సరే వారి సినిమాల్లో ఐటెం సాంగ్ లు చేయడానికి సిద్ధమని రష్మిక తెలిపారు. అయితే, ఆ డైరెక్టర్లు ఎవరనేది మాత్రం రష్మిక వెల్లడించలేదు.