Gaddam Prasad Kumar: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court Issues Notice to Telangana Assembly Speaker Gaddam Prasad Kumar
  • తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసు జారీ
  • స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
  • పార్టీ ఫిరాయింపులపై తీర్పును అమలు చేయలేదని ఆరోపణ
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్పీకర్ అమలు చేయడం లేదని ఆరోపిస్తూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. మహేశ్వర్‌రెడ్డి చేసిన ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని స్పీకర్‌ను ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది. అనంతరం ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పాడి కౌశిక్‌రెడ్డి, కేటీఆర్‌ల పిటిషన్లతో జత చేసింది. ఈ పిటిషన్లన్నింటిపైనా కలిపి ఫిబ్రవరి 6న విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది.
Gaddam Prasad Kumar
Telangana Assembly Speaker
Supreme Court Notice
Party Defection
Aleti Maheshwar Reddy
Justice Sanjay Karol
Paadi Kaushik Reddy
KTR
Telangana Politics
Court Contempt

More Telugu News