Trump: ప్రపంచ దేశాలకు ట్రంప్ మరో వార్నింగ్

Trump threatens new tariffs on countries opposed to Greenland takeover
  • గ్రీన్ లాండ్ ఆక్రమణను వ్యతిరేకిస్తే టారిఫ్ లు విధిస్తానని హెచ్చరిక
  • అమెరికా భద్రతకు గ్రీన్ లాండ్ చాలా కీలకమన్న అధ్యక్షుడు
  • అయితే సులువుగా, కాకపోతే కఠిన పద్ధతిలో గ్రీన్ లాండ్ ను స్వాధీనం చేసుకుంటామని వెల్లడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రపంచ దేశాలకు మరోసారి టారిఫ్ ల హెచ్చరికలు చేశారు. గ్రీన్ లాండ్ ను ఎలాగైనా తీసేసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేసిన ట్రంప్.. ఈ విషయంలో తమతో విభేదించే దేశాలకు టారిఫ్ లతో బదులిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా జాతీయ భద్రత విషయంలో గ్రీన్ లాండ్ చాలా కీలకమని, అయితే సులువుగా, కాకపోతే కఠిన పద్ధతిలోనైనా దానిని స్వాధీనం చేసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఈ ఆక్రమణను వ్యతిరేకిస్తే సహించబోనని చెప్పారు.

ప్రపంచ దేశాలను ఉద్దేశించి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ పరోక్షంగా డెన్మార్క్ ను నేరుగా హెచ్చరించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గ్రీన్ లాండ్ ను అమెరికా ఆక్రమించుకోవాలని చూడడాన్ని డెన్మార్క్ మొదటినుంచీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తమ అధీనంలోని గ్రీన్ లాండ్ ఎన్నటికీ స్వతంత్రంగానే ఉంటుందని డెన్మార్క్ అధ్యక్షుడు మెట్టె ఫ్రెడెరిక్సన్ పలుమార్లు తేల్చిచెప్పారు.

కాగా, ప్రస్తుతం అమెరికా, డెన్మార్క్ ల మధ్య అమలులో ఉన్న ఒప్పందాల ప్రకారం.. అమెరికా ఎప్పుడంటే అప్పుడు, ఎంతమంది బలగాలనైనా సరే గ్రీన్ లాండ్ కు తరలించవచ్చు. అమెరికా భద్రత కోసం గతంలో చేసుకున్న ఒప్పందాలలో ఈ నిబంధన ఉంది. అయితే, ట్రంప్ మాత్రం గ్రీన్ లాండ్ ను పూర్తిగా అమెరికా పరం చేయాలని పట్టుబడుతున్నారు. ఈ విషయంలో గ్రీన్ లాండ్ సహా ఏ దేశం అడ్డొచ్చినా ఆగేదిలేదని ట్రంప్ స్పష్టం చేశారు.
Trump
Greenland
Denmark
Tariffs
world Countries
Takeover
USA

More Telugu News