Vijayasai Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు

Vijayasai Reddy Receives ED Notice in AP Liquor Scam
  • ఈ నెల 22న ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో విచారణకు హజరు కావాలని నోటీసులు జారీ చేసిన ఈడీ
  • వైసీపీ హయాంలో మద్యం సరఫరాదారులు, డిస్టిలరీల నుంచి భారీ మొత్తంలో ముడుపులు స్వీకరించి, ఆ డబ్బును హవాలా మార్గంలో తరలించినట్లు అభియోగాలు
  • సిట్‌ ఇప్పటికే సేకరించిన కీలక పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా విచారణను వేగవంతం చేసిన ఈడీ
ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న ఢిల్లీ లేదా హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

ఇప్పటికే ఈ కేసులో పలువురు రాజకీయ నేతలు, అధికారుల పేర్లు వెలుగులోకి రాగా, తాజాగా విజయసాయి రెడ్డికి నోటీసులు అందడం చర్చనీయాంశమైంది.

మద్యం సరఫరాదారులు, డిస్టిలరీల నుంచి భారీ మొత్తంలో ముడుపులు స్వీకరించి, ఆ డబ్బును హవాలా మార్గంలో ఇతర రాష్ట్రాలు లేదా విదేశాలకు తరలించినట్లు అభియోగాలున్న నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ ఇప్పటికే సేకరించిన కీలక పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా ఈడీ విచారణను మరింత వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. 
Vijayasai Reddy
AP Liquor Scam
Andhra Pradesh
ED
Enforcement Directorate
YSRCP
Excise Department
Liquor Policy
Corruption Case

More Telugu News