Palakurthi Satyanarayana: శబరిమల నుంచి వస్తుండగా కన్యాకుమారి వద్ద తెలుగు దంపతుల మృతి

Telangana Couple Dies in Kanyakumari After Sabarimala Darsha
  • మృతులు లక్సెట్టిపేటకు చెందిన సత్యనారాయణ, రమాదేవి
  • నిన్న అయ్యప్ప స్వామిని దర్శించుకున్న దంపతులు
  • కన్యాకుమారిలో ప్రైవేట్ వాహనం ఢీకొని మృతి
తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన దంపతులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన పాలకుర్తి సత్యనారాయణ (63), రమాదేవి (59) తమ ఊళ్లో కిరాణా షాపును నిర్వహిస్తున్నారు. ఈ దంపతులు అయ్యప్ప స్వామి మాల ధరించారు. ఈ నెల 8న ఓ ప్రైవేట్ బస్సులో శబరిమల దర్శనానికి వెళ్లారు. నిన్న మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం తిరుగుపయనమయ్యారు. 

ఈ క్రమంలో కన్యాకుమారి వద్ద బైపాస్ రోడ్డులో బస్సును ఆపారు. అక్కడ సముద్ర స్నానం ముగించుకుని బస్సు దగ్గరకు వస్తుండగా సత్యనారాయణ, రమాదేవిని ఓ ప్రైవేట్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Palakurthi Satyanarayana
Sabarimala
Kanyakumari
Road Accident
Telugu couple
Telangana
Ayyappa Swamy
Makar Sankranti
Laksettipet

More Telugu News