Donthu Ramesh: ఎన్‌టీవీ జర్నలిస్ట్‌లకు బెయిల్

Donthu Ramesh and Sudheer get bail in NTV journalist case
  • రిమాండ్ రిపోర్టును తిరస్కరించిన కోర్టు
  • బెయిల్ పై విడుదల చేయాలని ఆదేశించిన కోర్టు
  • పోలీసుల చర్యలు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయన్న కోర్టు
హైదరాబాద్‌లోని ఎన్‌టీవీ ఛానల్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్‌ (ఇన్‌పుట్ ఎడిటర్), సుధీర్‌ (రిపోర్టర్)లకు మేజిస్ట్రేట్ కోర్టులో ఊరట లభించింది. వీరి రిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. ఇటీవల ప్రసారమైన ఓ వివాదాస్పద కథనంపై ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు పలువురు జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.
 
దొంతు రమేష్‌ను హైదరాబాద్‌ విమానాశ్రయంలో బ్యాంకాక్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకోగా, సుధీర్‌ను ఆయన నివాసం వద్ద అరెస్టు చేశారు. జర్నలిస్టుల అరెస్టులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.
 
నిన్న వీరిద్దరినీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచి పోలీసులు రిమాండ్ కోరారు. అయితే ప్రాథమిక ఆధారాలు సరిపోవడం లేదని, అరెస్టు సమయంలో నోటీసులు ఇవ్వకపోవడం వంటి విధి విధానాల్లో లోపాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ తరహా చర్యలు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉంటాయని పేర్కొంటూ రిమాండ్‌ను తిరస్కరించి, బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది.
 
ఈ ఘటనపై బీఆర్ఎస్, వైసీపీ నేతలు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా స్పందించాయి. మరోవైపు పోలీసులు మాత్రం తమ చర్యలు చట్టబద్ధంగానే చేశామని స్పష్టం చేశారు. 
Donthu Ramesh
NTV
NTV journalist
journalist arrest
Telangana journalists
IAS officers association
Sudheer
freedom of press
journalist bail
Hyderabad

More Telugu News