S Jaishankar: ఇరాన్‌లో తీవ్ర ఉద్రిక్తతలు... జైశంకర్‌కు ఫోన్ చేసిన ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చి

S Jaishankar receives call from Iranian minister Abbas Araghchi amid tensions
  • ఇరాన్‌‌లో తీవ్ర రూపం దాలుస్తున్న హింసాత్మక ఘటనలు
  • ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చి తనకు ఫోన్ చేశారన్న భారత మంత్రి జైశంకర్
  • ఇరాన్‌లో నెలకొన్న పరిస్థితులతో పాటు ప్రాంతీయ భద్రతా అంశాలపై చర్చించినట్లు వెల్లడి
ఇరాన్‌లో హింసాత్మక ఘటనలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆందోళన నెలకొంది. ఈ పరిణామాల మధ్య ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తనకు ఫోన్ చేసినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. ఇరాన్‌లో నెలకొన్న పరిస్థితులతో పాటు ప్రాంతీయ భద్రతా అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు జైశంకర్ 'ఎక్స్' వేదికగా తెలియజేశారు.

ఇరాన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్న వేళ అక్కడ ఉన్న భారతీయుల భద్రతపై కేంద్రం ఇప్పటికే అప్రమత్తమైంది. అందుబాటులో ఉన్న రవాణా మార్గాలను వినియోగించుకుని వీలైనంత త్వరగా ఇరాన్‌ను విడిచిపెట్టాలని అక్కడి భారత రాయబార కార్యాలయం సూచించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ విదేశాంగ మంత్రి నుంచి జైశంకర్‌కు ఫోన్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు, ఇరాన్‌లో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కూడా కీలక సూచనలు జారీ చేసింది. తదుపరి నోటీసు ఇచ్చే వరకు ఇరాన్‌కు ప్రయాణాలు చేయవద్దని భారత పౌరులకు స్పష్టం చేసింది. 
S Jaishankar
Iran unrest
Abbas Araghchi
Iran protests
Indian embassy Iran
India Iran relations
Regional security
Iran travel advisory
Indians in Iran
Middle East crisis

More Telugu News