కెనడాలో భారత సంతతి వ్యాపారవేత్త హత్య.. బుల్లెట్ గాయాలతో మృతి
- పంజాబ్‌కు చెందిన వ్యాపారవేత్త బిందర్ గర్చా హత్య
- సర్రే నగరంలోని తన ఇంటికి కొంత దూరంలో గాయాలతో పడిపోయిన వ్యాపారవేత్త
- కొన్నేళ్లుగా కెనడాలో నివసిస్తున్న బిందర్ గర్చా
బిందర్ గర్చా గత కొన్నేళ్లుగా కెనడాలో నివసిస్తున్నారని, స్టూడియో-12 పేరుతో ఫొటో స్టూడియోను నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు ఉపయోగించినట్లు భావిస్తున్న కాలిపోయిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.