Donald Trump: ఫోర్డ్ ఫ్యాక్టరీలో ట్రంప్‌కు నిరసన.. మధ్య వేలితో బదులిచ్చిన అధ్యక్షుడు.. వీడియో ఇదిగో!
- ఫోర్డ్ ఫ్యాక్టరీ పర్యటనలో ట్రంప్‌కు నిరసన సెగ
- ‘పీడోఫైల్ ప్రొటెక్టర్’ అంటూ కార్మికుడి నినాదం
- మధ్యవేలితో బదులిచ్చినట్లు ఆరోపణలు
- అధ్యక్షుడి చర్యను సమర్థించిన వైట్‌హౌస్
- నినాదాలు చేసిన ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఫోర్డ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనలో వివాదం చోటుచేసుకుంది. మిచిగాన్‌లోని ఫోర్డ్ మోటార్ కంపెనీ ప్లాంట్‌లో పర్యటిస్తుండగా ఒక కార్మికుడు ఆయనను దూషించాడు. దీనికి ప్రతిస్పందనగా ట్రంప్ అనుచిత సైగ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మంగళవారం డియర్‌బోర్న్‌లోని ఫోర్డ్ రివర్ రూజ్ కాంప్లెక్స్‌లో ఈ ఘటన జరిగింది.
ట్రంప్ ఫ్యాక్టరీలో నడుస్తుండగా ఒక కార్మికుడు ‘పీడోఫైల్ ప్రొటెక్టర్’ (బాలల లైంగిక వేధింపుల రక్షకుడు) అని గట్టిగా అరిచాడు. ఆ అరుపులు వినిపించిన వైపు తిరిగిన ట్రంప్ నోటితో ఒక దూషణ పదాన్ని ఉచ్చరించి, మధ్యవేలు చూపించినట్లు వీడియోలో రికార్డ్ అయింది. ఈ వీడియోను మొదట టీఎమ్‌జడ్ (TMZ) ప్రచురించింది. జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసు వ్యవహారంలో ట్రంప్ ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో కార్మికుడు ఆ విధంగా నినాదం చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై వైట్‌హౌస్ స్పందించింది. అధ్యక్షుడి చర్యను సమర్థిస్తూ వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చుంగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. "ఒక ఉన్మాది కోపంతో పిచ్చిగా అరుస్తూ దూషించాడు. దానికి అధ్యక్షుడు సరైన, స్పష్టమైన సమాధానం ఇచ్చారు" అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, నినాదాలు చేసిన కార్మికుడు టీజే సబులాను ఫోర్డ్ కంపెనీ సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని తెలిపింది. అయితే, తాను చేసిన పనికి ఎలాంటి పశ్చాత్తాపం లేదని సబులా ఒక వార్తాసంస్థతో అన్నారు. తమ కంపెనీలో అమర్యాదకర ప్రవర్తనను సహించబోమని, ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకుంటామని ఫోర్డ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.