Nara Lokesh: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు... పాల్గొన్న మంత్రి లోకేశ్ ... ఫొటోలు ఇవిగో!

Nara Lokesh Participates in Sankranti Celebrations at Naravaripalle
  • నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు
  • సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులతో కలిసి సంబరాల్లో లోకేశ్ సందడి
  • ముగ్గుల పోటీలు, విద్యార్థుల క్రీడలను తిలకించిన నేతలు
  • గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన చంద్రబాబు, భువనేశ్వరి
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులతో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ముందుగా టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించారు. 

అనంతరం స్థానికంగా వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులతో నిర్వహించిన క్రీడా పోటీలను వీక్షించారు. క్రీడా పోటీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ, విద్యార్థులకు సీఎం చంద్రబాబు, భువనేశ్వరి బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో భాగస్వాములైన ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని ఘనంగా సన్మానించారు. విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు. 

ఈ కార్యక్రమంలో నారా బ్రహ్మణి, తేజస్విని, ఎంపీ శ్రీ భరత్, నారా రోహిత్, నారా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో మంత్రి లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ కూడా వివిధ గ్రామీణ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. తాత చంద్రబాబు చేతులమీదుగా ఓ ప్రైజు కూడా అందుకున్నాడు. 
Nara Lokesh
Nara Chandrababu
Naravaripalle
Sankranti celebrations
Andhra Pradesh
Telugu Desam Party
Nara Devaansh
Puliarthi Nani
Bojjala Sudheer Reddy
Sri Bharat

More Telugu News