Prabhas: రూ. 200 కోట్ల క్లబ్ లో చేరిన ప్రభాస్ 'ది రాజాసాబ్'... చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన

Prabhas The Raja Saab Enters 200 Crore Club Officially Announced
  • నెగెటివ్ టాక్ తెచ్చుకున్న 'ది రాజాసాబ్'
  • వసూళ్లలో మాత్రం దూసుకుపోతున్న చిత్రం
  • నాలుగు రోజుల్లో రూ. 201 కోట్లు వసూలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ 'ది రాజాసాబ్'కు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ... కలెక్షన్ల పరంగా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది. ఈ నెల 9న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ... నాలుగు రోజుల్లో రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 201 కోట్లు వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 


ఈ సినిమా స్క్రిప్ట్ బలహీనంగా ఉందని, స్టోరీ డ్రాగ్ అవుతోందని, జానర్ల మధ్య కనెక్షన్ లేదని పలువురు క్రిటిక్స్, ఆడియన్స్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. రివ్యూలు కూడా 1.5 నుంచి 3 స్టార్ల మధ్యే ఉన్నాయి. కానీ కలెక్షన్స్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఓపెనింగ్ డే ప్రీమియర్లతో కలిపి రూ.100 కోట్లు దాటేసింది. మొదటి వీకెండ్ లోపల ఇండియాలో రూ.100+ కోట్లు, వరల్డ్‌వైడ్ రూ.150-160 కోట్లు దాటాయి. నాలుగు రోజుల్లో రూ.200 కోట్లు దాటింది.

Prabhas
The Raja Saab
Maruthi
Telugu Movie
Box Office Collection
200 Crore Club
Pan India Movie
Telugu Cinema
Movie Review
Film Industry

More Telugu News