Allu Arjun: జపాన్​ లో పుష్ప 2 రిలీజ్.. టోక్యో చేరుకున్న అల్లు అర్జున్

Allu Arjun Reaches Tokyo with Family for Pushpa 2 Release
  • ఫ్యామిలితో కలిసి ఐకాన్ స్టార్ టోక్యో పర్యటన
  • ఈ నెల 16 నుంచి జపాన్ ఆడియన్స్ ను అలరించనున్న పుష్ప
  • పుష్ప కున్రిన్ పేరుతో విడుదల
బాక్సాఫీసు రికార్డులను తిరగరాసిన పుష్ప 2 సినిమా తాజాగా జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. ఈ నెల 16న ‘పుష్ప కున్రిన్’ పేరుతో జపాన్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్యాపిల్లలతో కలిసి టోక్యో పర్యటనకు వెళ్లారు. టోక్యోకు చేరుకున్నట్లు అల్లు అర్జున్ మంగళవారం ఓ ఫొటోను పంచుకున్నారు.

పుష్ప2 సినిమాను జపాన్ లో గీక్ పిక్చర్స్, షోచికు సంస్థలు సంయుక్తంగా విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలో సదరు నిర్మాణ సంస్థల ప్రతినిధులు అల్లు అర్జున్ కు స్వాగతం పలుకుతూ, పుష్ప రిలీజ్ ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. జపనీస్ భాషలోకి సినిమాను డబ్ చేసి ఇటీవల సినిమా పోస్టర్, ట్రెయిలర్లను విడుదల చేశారు.
Allu Arjun
Pushpa 2
Pushpa The Rule
Japan Release
Tokyo
Geek Pictures
Shochiku
Telugu Movie
Indian Cinema

More Telugu News