Sophie Devine: సోఫీ డివైన్ విధ్వంసక ఇన్నింగ్స్... నందిని శర్మ హ్యాట్రిక్
- డబ్ల్యూపీఎల్ లో పరుగుల వరద పారించిన గుజరాత్ జెయింట్స్
- విధ్వంసక ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన సోఫీ డివైన్ (95)
- ఐదు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న డివైన్
- ఐదు వికెట్లతో సత్తా చాటిన ఢిల్లీ బౌలర్ నందిని శర్మ
- ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 210 పరుగుల భారీ లక్ష్యం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026లో భాగంగా గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సోఫీ డివైన్ (95), ఆష్లే గార్డనర్ (49) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. ఢిల్లీ బౌలర్ నందిని శర్మ ఐదు వికెట్లతో సత్తా చాటింది. అందులో హ్యాట్రిక్ కూడా ఉండడం విశేషం.
నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్‌కు ఓపెనర్లు సోఫీ డివైన్, బెత్ మూనీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా డివైన్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 42 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 95 పరుగులు చేసి ఢిల్లీ బౌలర్లను హడలెత్తించింది. కేవలం 5 పరుగుల తేడాతో ఆమె శతకాన్ని చేజార్చుకుంది. తొలి వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అనంతరం వచ్చిన కెప్టెన్ ఆష్లే గార్డనర్ కూడా తనదైన శైలిలో 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.
కెప్టెన్ ఆష్లీ గార్డనర్ (26 బంతుల్లో 49) మెరుపు ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. దీంతో గుజరాత్ స్కోరు 220 దాటేలా కనిపించింది. అయితే, ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన 24 ఏళ్ల నందిని శర్మ అద్భుతం చేసింది. ఆ ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టింది. చివరి మూడు బంతులకు కనికా అహుజా, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేసింది. మొత్తంగా 33 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన నందాని.. WPL చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన తొలి అన్‌క్యాప్డ్ బౌలర్‌గా చరిత్ర సృష్టించింది. గుజరాత్ భారీ స్కోరు చేయాల్సినప్పటికీ, ఆమె ధాటికి 209 పరుగులకే పరిమితమైంది.