Chandrababu Naidu: రేపు మంత్రులు, శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- విజన్ 2047, ఆదాయార్జన మార్గాలపై కీలక సమీక్ష
- రెవెన్యూ శాఖ సేవలు, ఆస్తుల భద్రతపై అధికారులకు దిశానిర్దేశం
- వర్చువల్‌గా హాజరుకానున్న జిల్లా కలెక్టర్లు
- సమావేశం అనంతరం సంక్రాంతికి నారావారిపల్లెకు సీఎం
రాష్ట్ర పాలన, ప్రభుత్వ లక్ష్యాల అమలును వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సోమవారం నాడు మంత్రులు, శాఖల కార్యదర్శులతో ఆయన సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు కూడా వర్చువల్ విధానంలో హాజరు కానున్నారు.
సమావేశం ప్రారంభంలో, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ), 2047 విజన్‌లోని 10 సూత్రాలపై అధికారులు ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం ఆదాయార్జన మార్గాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల పురోగతి, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) ప్రాజెక్టులు, పెట్టుబడుల ఆకర్షణ, ఫైళ్ల పరిష్కారం, ఆన్‌లైన్ సేవలు, వాట్సాప్ గవర్నెన్స్ వంటి కీలక అంశాలపై సీఎం సమీక్ష జరుపుతారు.
ముఖ్యంగా రెవెన్యూ శాఖ పనితీరుపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, భూముల సర్వే, రిజిస్ట్రేషన్ సేవలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై మంత్రులు, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీతో ప్రజల ఆస్తులకు పటిష్ఠ భద్రత కల్పించే విధానంపైనా చర్చిస్తారు. వీటితో పాటు కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన 'వీబీ జీ రామ్ జీ' పథకంపై కూడా సమీక్షించనున్నారు. సమావేశం ముగిసిన అనంతరం, సాయంత్రం సీఎం చంద్రబాబు సంక్రాంతి పండుగ కోసం తన స్వగ్రామం నారావారిపల్లెకు బయలుదేరి వెళతారు.