దుర్గమ్మ గుడిలో భక్తులకు కరెంట్ షాక్.. విద్యుత్ నిలిపేసిన అధికారులు
- ప్రసాద వితరణ కేంద్రం దగ్గర షాక్ తగిలిందన్న భక్తులు
- వెంటనే స్పందించి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసిన సిబ్బంది
- భక్తులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆలయ సిబ్బంది వివరణ
ఆలయ ఎలక్ట్రీషియన్, అధికారులు ప్రసాద వితరణ కేంద్రం వద్ద ఉన్న విద్యుత్ తీగలను పరిశీలించారు. సంక్రాంతి సెలవులు కావడంతో శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు విద్యుత్ షాక్ తగలడం కలకలం రేపింది. అయితే, విద్యుత్ షాక్ కారణంగా భక్తులు ఎవరూ గాయపడలేదని, మరమ్మతులు పూర్తి చేసిన తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.