Amitabh Bachchan: అభిమానుల తాకిడి.. అమితాబ్‌కు తప్పిన ప్రమాదం.. వీడియో వైర‌ల్‌!

Amitabh Bachchan narrowly escapes accident at Surat airport due to fan frenzy
  • సూరత్ ఎయిర్‌పోర్ట్‌లో అమితాబ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్‌
  • అభిమానుల‌ తాకిడికి పగిలిపోయిన ఎయిర్‌పోర్ట్ గ్లాస్ డోర్
  • త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడిన బిగ్ బీ
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు సూరత్ విమానాశ్రయంలో ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. తనను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అమితాబ్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చి తన కారు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆయన్ను చుట్టుముట్టారు.

ఈ క్రమంలో ఏర్పడిన తోపులాటలో విమానాశ్రయం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. అయితే, ఆ సమయంలో అమితాబ్ కాస్త దూరంగా ఉండటంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అభిమానుల అత్యుత్సాహం కారణంగా చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Amitabh Bachchan
Amitabh Bachchan accident
Surat airport
Bollywood actor
Fan frenzy
Viral video
Amitabh Bachchan fans
Airport incident

More Telugu News